![]() |
![]() |
.webp)
బుల్లితెర చరిత్రలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సీరియల్ "కార్తీక దీపం". ఈ సీరియల్ దాదాపు ఐదారేళ్లుగా అభిమానులను అలరిస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు దీనికి శుభం కార్డు పడే సమయం దగ్గరికొచ్చింది. ఒక్క రోజు ఈ సీరియల్ మిస్ అయినా.. తట్టుకోలేని ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. వారికి ఈ సీరియల్ లో ప్రతి క్యారెక్టర్ బాగా గుర్తుండిపోతుంది. ముఖ్యమైన పాత్రలైనా వంటలక్క, డాక్టర్ బాబు తరువాత విలన్ రోల్ విషయం గురించి చెప్పుకోవాల్సి వస్తే మోనిత గురించి చెప్పాలి. ఈ పాత్రలో నటించిన క్యారెక్టర్ పేరు శోభా శెట్టి. రీసెంట్ గా మోనిత పాత్ర పూర్తైపోయేసరికి ఆమెను పంపించేశారు. అప్పుడు బాధపడుతూ వీడియో కూడా చేసింది.
ఐతే ఇప్పుడు సీరియల్ కి ఎండ్ కార్డు పడే టైం అయ్యేసరికి మోనితని మళ్ళీ సీరియల్ లోకి తీసుకొచ్చారు. ఐతే ఇప్పుడు సీరియల్ ఐపోతున్న సందర్భంగా మోనిత తన సీరియల్ టీమ్ మొత్తానికి కూడా మంచి గిఫ్ట్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. దాని కోసం స్వీట్ షాప్ కి వెళ్లి అందరికీ స్వీట్స్ తీసుకుంది. ఎందుకంటే స్వీట్ తినడం, తినిపించడం అనేది ప్రతీ సెలబ్రేషన్ లో ఒక భాగం..అలాగే లైఫ్ ని ఫ్రెష్ గా రీస్టార్ట్ చేయడానికి ఒక గుర్తుగా స్వీట్ ని తింటారు అని చెప్పింది మోనిత. అలాగే చాక్లేట్లు, స్వీట్స్ తో మంచి కలర్ ఫుల్ ప్యాకింగ్ తో హ్యాంపర్స్ ని రెడీ చేయించింది. ఎవ్వరికైనా గిఫ్ట్స్, హ్యాంపర్స్ ఇస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పింది. ఇన్ని ఇయర్స్ టీంతో కలిసి పని చేసినా ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు.
ఇప్పుడు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఏమిస్తానా అని చెప్పింది. మొత్తం టీమ్ లో ఉన్న 60 మందికి స్వీట్స్ ని ప్యాక్ చేయించింది. యాక్టువల్ గా తన ఫోటో వేయించిన మ్యాజికల్ కప్ ని ఇద్దామనుకుందట. కానీ సీరియల్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ వలన అస్సలు టైం లేదని చెప్పింది. ఇలాంటి మ్యాజికల్ కప్ ని ప్రిపేర్ చేయడానికి సుమారు నాలుగైదు రోజులు పడుతుందట..సో ప్రస్తుతానికి అందరికి స్వీట్స్ తీసుకుంటున్నట్లు చెప్పింది. ఇక ఫైనల్ గా షూటింగ్ సెట్ లో కేక్ కట్ చేసుకుని ఒకరికొకరు తినిపించుకున్నారు. డాన్సులు చేసి ఫుల్ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది మోనిత. ఇక నెటిజన్స్ "మిస్ యూ" అంటూ కామెంట్స్ చేశారు.
![]() |
![]() |